social
చిరంజీవి అద్భుతమైన ట్వీట్
మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్..
Kalinga Times, Hyderabad : మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన ట్వీట్ చేశారు.వీడియో ద్వారా ప్రస్తుతమున్న పరిస్థితులపై సందేశాన్ని అందించారు. కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్.. అంటూ ట్విటర్లో ఒక వీడియోను ట్వీట్ చేశారు. చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. మాస్క్ ధరించాలంటూ యువ హీరోయిన్ ఈషా రెబ్బతో కలిసి చిరు ‘మెగా’ సందేశం ఆకట్టుకుంటోంది.
అదేవిధంగా ఆర్ఎక్ష్ 100 హీరో కార్తికేయతో కలిసి కూడా చిరు మరో వీడియో సందేశం అందించారు. మీసం మెలేయడం వీరత్వం అనేది ఒకపుడు.. కానీ ఇపుడు మాస్క్ ధరించడం వీరుడి లక్షణం అంటూ మరో వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.
Thank you @ActorKartikeya @YoursEesha #chaitanbharadwaj ఆలోచన పంచుకోగానే ముందుకొచ్చిన మీకు నా ధన్యవాదాలు. I truly appreciate your commitment to the society. #SVVishweshwar #ShivramApte #Pappu #Babji pic.twitter.com/k6zyniBfc1
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2020
@WHO Chief @DrTedros on Covid 19,13th July -"It’s going to get worse & worse.Every single person can do their bit to break chains of transmission & end collective suffering".అందుకే,మాస్క్ తప్పనిసరిగా ధరించండి.మిమ్మల్ని మీరు కాపాడుకోండి.మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడండి. Please! pic.twitter.com/vOTwX3UZPk
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2020