Telangana
కంటోన్మెంట్ ప్రాంతంలో గుంతలను పూడ్చిన టీఆర్ఎస్ నాయకులు
Kalinga Times,Contonment, గవ్వల శ్రీనివాసులు:కేంద్ర రక్షణ శాఖ పరధిలోని కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్లు మరమ్మత్తులకు నోచు కోక పోవడంతో స్వచ్ఛందంగా టీఆర్ఎస్ నాయకులు శ్రమదానం చేసి రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చి వేశారు.ఈ రోజు కంటోన్మెంట్ లోని ఏడవ వార్డు లో గల లాల్ బజార్ నుంచి మిలటరీ ఢైరి ఫాం రోడైన జాతీయ రహదారికి అప్రోచ్ ప్రధాన రహదారి గత కొంత కాలం నుంచి అధ్వాన్న స్తితిలో కూరుకు పోవడం,గుంతలగుంతలుగా ఏర్పడడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటుంన్నారు.ఈ రోడ్డు గుండా వెల్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెల్లవలసిందే.తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని,పలువురు ప్రాణాలు కూడ కోల్పోయారని స్థానికులు చెప్పారు. ఈ రోడ్డు మరమ్మత్తులకు బోర్డు అధికారులు రూ.70 లక్షలు మంజూరు చేసినప్పటికి ఎలాంటి మరమ్మతులకు నోచుకోక పోవడంతో స్వచ్చందంగా టీఆర్ఎస్ నాయకులు,స్థానిక కాలనివాసులు,ట్రాఫిక్ పోలీసులు శ్రమధానంచేసి రోడ్లు పూడ్చారు.కంటోన్మెంట్ సీనియర్ నాయకులు క్రిశాంక్,స్థానిక బోర్డు సభ్యురాలు పి.భాగ్యశ్రీ భర్త పి.శ్యామ్ సుందర్,వార్డు అధ్యక్షులు మధు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గన్నారు.క్రిశాంక్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతు రోడ్డు మరమత్తులకు నిధులు మంజూరైనప్పటికి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.అధికారులు ఇప్పటికైనా మరమ్మత్తులు చేసి వాహనాదారుల ప్రాణాలు కాపాడాలని,వారి భాధలను తోలగించాలని కోరారు.లేని పక్షంలో ఆందోలనకు పూనుకోగలమని ఆయన హెచ్చరించారు.