social
తెల్లవారు జాము నుంచే సికింద్రాబాద్ మహంకాళి బోనాలు
Kalinga Times,Hyderabad : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు. తెల్లవారు జాము నుంచే మహంకాళీ అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. తెల్లవారు జామున 4 గంటలకు మంత్రి తలసాని కుటుంబ సభ్యులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి తొలి బోనం, వెండి తొట్టెలు మంత్రి తలసాని సమర్పించారు. తొలి బోనం సమర్పణతో మహంకాళీ అమ్మవారి జాతర ప్రారంభమైంది. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తెల్లవారు జాము నుంచే ఆలయ పరిసరాలు జాతరను తలపించాయి. మధ్యాహ్నం మంత్రి తలసాని నేతృత్వంలో భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. 1000 మంది మహిళలు బోనాలతో తోడురాగా అమ్మవారికి మాజీ ఎంపీ కవిత బోనం సమర్పించనున్నారు. ఎత్తయిన వాహనంలో బంగారు బోనం ఊరేగించనున్నారు.