Telangana
హరీష్ బాబు అక్రమ అరెస్ట్
Kalinga Times ,కాగజ్ నగర్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సీతక్క , శ్రీధర్ బాబు , జగ్గారెడ్డి , పొదేం.వీరయ్య కాగజ్ నగర్ మండలం సార్సల గ్రామంలో పోడు రైతుల భూములను సందర్శించుటకు వస్తున్న సందర్భంగా అక్రమంగా డా.పాల్వాయి హరీష్ బాబును తన స్వగృహంలో అరెస్ట్ చేశారు. ప్రతిపక్షం లేకుండా, ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోడు రైతులకు అన్యాయం జరుగుతోందని విమర్శిచారు.