National
చికిత్స మధ్యలోనే కు గుండెపోటురావడంతో సుష్మా మృతి

Kalinga Times,New Delhi : గత కొంతకాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న న్న కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ కన్నుమూశారు. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సుష్మా మంగళ వారం మరింత అస్వస్థత కు గురి కావటంతో కుటుంబ స భ్యులు అత్యవసరంగా ఎయిమ్ష్ తరలించారు. అయితే చికిత్స అందిస్తుండగానే మధ్యలోనే కు గుండెపోటురావడంతో సుష్మా కన్నుమూశారు. కన్నుమూసిన సుష్మ స్వరాజ్ వయస్సు 67 సంవత్సరాలు. సమాచారం అందుకున్నకేంద్ర మంత్రులు గట్కారీ, హర్ష వర్ధన్ లు ఎయిమ్స్ కి చేరుకున్నారు. సుష్మా మరణ వార్తా మీడియాలో రావటంతో దెస వ్యాప్తంగా బీజేపీ శ్రేణులలో సర్వత్రా విషాదం అలుముకుంది ఆమె ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సుష్మా స్వరాజ్.. ట్విటర్లో ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ యాక్టివ్గా ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసినట్లు సమాచారం అందుకున్న నేతలు ఆమెకు సంతాపం చెబుతూ పోస్టులు పెడుతున్నారు.కాగా,ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ నాలుగు గంటల క్రితం చివరి ట్వీట్ చేశారు. లోక్సభలో జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం పొందగానే ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభినందిస్తూ ట్వీట్ కూడా చేశారు. జీవితంలో తాను ఈ రోజు కోసమే ఎదురుచూశానని సుష్మ ట్వీట్ చేశారు.