Telangana
వెయ్యి కోట్లను నీళ్ళలాగ పారపోస్తం

మంచిర్యాల మున్సిపాలిటీని కార్పోరేషన్ చేసి ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ది చేస్తామని మాజి పార్లమెంట్ సభ్యులు,ప్రస్తుత చెన్నూరు శాసన సభ్యులు బాల్క సుమన్ అన్నారు.బుధవారం మంచిర్యాల ఐబిలో ఏర్పాటు చేసిన ధూం ధాం కార్య క్రమంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల పట్టణాన్ని కరిం నగర్, వరంగల్ కు ధీటుగా అభివృద్ధి చేస్తామంటూ చెప్పుకొస్తూ వెయ్యి కోట్ల రూపాయలను వట్టిగనే నీళ్ళలాగ పారపోస్తమన్నారు.ఇది విన్న స్థానికులు పట్టణం లో పలు ప్రాంతాలలో మంచి నీటి సరఫరా కే అతీ గతీలేదు అపుడెపుడో మిషన్ భగీరథ అన్నరు పైపు లైన్లు కనబడుతున్నై అన్నరు నీళ్ళేవంటే ఇదిగో వచ్చె … అంటూ కాలయాపనతోనే అధికారంలోకొచ్చి నాలుగు నెళ్ళు గడిపి ఇపుడొచ్చి మరో కథ చెప్పి మంచి బిస్కట్ వేస్తుండంటూ నవ్వుకున్నారు.