social
మంచిర్యాలలో గాంధారి మైసమ్మ జాతర ఉత్సవాలు
Kalinga Times, Mancherial :మంచిర్యాలలో ప్రతి ఏడాది మాఘ పౌర్ణమి న ఘనంగా నిర్వహించే గాంధారి మైసమ్మ జాతర ఉత్సవాలు శుక్రవారం నాయక్ పోడ్ జాతి సంప్రదాయంలో ప్రారంభమయ్యాయి.తప్పెటగోళ్ళు,పిళ్ళన గోవులతో ఆది వాసులు శుక్రవారం ఉదయం గోదావరి నదికి చేరుకొని పూజలు నిర్వహించారు,అనంతరం గోదావరి జలాలను తీసుకు వచ్చారు.శనివారం అమ్మవార్లను శుద్ధిచేసి పూజలు నిర్వహిస్తారు.మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ వేడుకకు ఉత్తర తెలంగాణ జిల్లావాసులు పెద్ద ఎత్తున హాజరవుతారు.