Film
గాన గంధర్వుడు..ఎస్పీ బాలు ఇక లేరు

Kalinga Times, Hyderabad : గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం .(74) మరణించారు. కోవిడ్ తో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ…ఆయన తుది శ్వాస విడిచినట్లు. శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఎస్పీ బాలు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.40 రోజులుగా ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలు కోవిడ్ బారి నుంచి బయట పడ్డారని ఒక దశలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అయతే ఊపిరి తిత్తుల ఇన్ ఫెక్షన్ కారణంగా ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స కొనసాగించారు.కొంత కాలం ఎక్మో సపోర్ట్ తో వైద్యం అందించినా కోలుకుంటుండటంతో ఆ సపోర్ట్ తొలగించి వెంటిలేటర్ పై చికిత్స కొనసాగిస్తూ వచ్చారు.గత పది రోజులుగా రోజూ ఫిజియో థెరఫీ కూడా చేస్తున్నారు. పూర్తిగా కోలుకున్నారనీ, అంతా భావిస్తున్న సమయంలో నిన్న సాయంత్రం ఆయన ఆరోగ్యం విషమించింది. వైద్య నిపుణులు ఎంత ప్రయత్నించినా ఆయనను కాపాడ లేకపోయారు .