Telangana
వందల సంఖ్యలో ప్రజలు ఆయన చుట్టూ ఉంటున్నారని…
Kalinga Times, Sangareddy : మీ రాజకీయం కోసం సంగారెడ్డి ప్రజలను చంపుతారా? నియోజకవర్గాన్ని శ్మశానవాటికగా మారుస్తారా? మంత్రి హరీశ్‌రావు నా నియోజకవర్గానికి రాకండి. నేను రాలేకనా? తిరగలేకనా?’ అని మంత్రి హరీశ్‌రావు పర్యటించడంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో సంగారెడ్డి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని ఆదివారం ఒక ప్రకటనలో జగ్గారెడ్డి వాపోయారు. హరీశ్‌రావు వివిధ కార్యక్రమాల పేరుతో సంగారెడ్డికి వచ్చినప్పుడు వందల సంఖ్యలో ప్రజలు చుట్టూ ఉంటున్నారని దీంతో కరోనా వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.