
Kalinga Times, aurangabad : ఔరంగాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ట్రాక్‌పై నిద్రిస్తున్న కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 17 మంది వలస కూలీలు మృతి చెందారు. చనిపోయిన వారిలో కొందరు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. వలస కూలీలు మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారంతా రైల్వే ట్రాక్ పక్కనే కాలి నడకగా స్వస్థలాలకు వెళుతున్నట్లుగా తెలిసింది. మార్గ మధ్యలో పట్టాలపై నిద్రించినట్లుగా సమాచారం. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రైల్వే ట్రాక్‌పై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కలచివేశాయి. ఔరంగాబాద్- జల్నా మధ్య ఉదయం 6:30 గంటలకు ఈ ఘటన జరిగింది.