social
కొత్త లుక్‌తో కనిపించి ఫిదా చేస్తోంది

నటి సాయిపల్లవి నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈ అమ్మడికి బోలెడంతా పాపులారిటీ వచ్చింది. మళయాలంలో ప్రేమమ్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. తెలుగులో ఫిదాతో తిరుగులేని గుర్తింపు తెచ్చుంది. అదే సమయంలో తమిళంలో సైతం తనదైన ముద్రవేసుకుంది. సెలక్టివ్‌గానే ఉంటోంది. ఇటీవల తన ప్రేమ వ్యవహారంపై వచ్చిన వార్తలను కండించింది. నిజం లేదని స్పష్టం చేసింది. ఇక మారి 2లో రౌడీ బేబీ పాట ద్వారా ఆమెకు వచ్చిన పాపులారిటీ మామూలుగా లేదు. ఇప్పటికీ ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. ఇటీవల సాయి పల్లవి కొత్త లుక్‌తో కనిపించి ఫిదా చేసింది. కేరళ సంప్రదాయం ప్రకారం ధరించే చీరలో మెరిసిపోయింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది. అభిమానులు కూడా లైక్‌లు కురిపిస్తూ, షేర్ చేస్తున్నారు. కొన్ని సార్లు సినిమాకు సంబంధం లేకుండానే తారలు అభిమానులను ఆనందపరుస్తుంటారు.