Telangana
లాక్‌డౌన్ స్ఫూర్తికి తూట్లు పొడిచి… కార్ పాస్ జారీ చేసిన ఏసీపి
Kalinga Times, Mancherial : పోలీస్ శాఖలోని వారే అక్రమాలకు పాల్పడి లాక్‌డౌన్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. మంచిర్యాల ఏసీపీ లక్ష్మీనారాయణ అవినీతికి పాల్పడి అభాసుపాలయ్యారు. ఏసీపి జారీచేసిన కార్ పాస్‌తో ఓ వ్యక్తి హైదరాబాద్‌కి వచ్చాడు. ఈ విషయం తెలిసిన అతని స్నేహితుడు.. తనకూ అదే తరహాలో కార్ పాస్ ఇవ్వాలని రాచకొండ కమిషనర్‌ను కోరాడు. అతడి మాటలకు షాక్ తిన్న రాచకొండ కమిషనర్ అతడి విజ్ఞప్తిని తిరస్కరించాడు. మంచిర్యాల ఏసీపీ రిఫ్రిజిరేటర్ తీసుకుని తన స్నేహితునికి కార్ పాస్ ఇచ్చారని.. తనకూ ఇవ్వాలని పదేపదే ప్రాధేయపడ్డాడు. దీంతో జరిగిన ఘటనపై విచారణ జరిపించగా.. రిఫ్రిజిరేటర్ తీసుకున్నట్టు తేలింది. వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఆ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రభ మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా మంచి ర్యాల ఏసీపీ సి.హెచ్ లక్ష్మి నారాయణ కారు పాస్ ఇవ్వడానికి ఫ్రిజ్ తీసుకొన్నాడు అనేది, ఆ పాస్ సంపాదించిన వ్యక్తి మంచిర్యాల విధుల్లో సైరన్ తో రయ్, రాయ్ మని తిరుగినట్లు గా, అట్టి పాస్ తో హైదరాబాద్ కి వెళ్లినట్టుగా మరియు అట్టి వ్యక్తి తన బంధువులు చెప్పగా, వారు మహేష్ భగవత్ గారి దగ్గరకి వెళ్లి మాకు కూడా ఎలాంటి పాసులు కావాలని అడగగా మహేష్ భగవత్ గారు అవాక్కు అయి దానిని ఫోటో తీసుకోని ఉన్నత అధికారులకి పంపినట్టుగా ఇట్టి విషయాలపై స్పెషల్ బ్రాంచ్ విచారణ జరిపినట్టు, ఈ ఆరోపణల పైనే డీజీపీ గారి ఆఫీస్ కి అటాచ్ చేశారు. అనే ఫై ఆరోపణలు అన్ని ఆవాస్తవాలు, సత్యదూరమైనవి. లాక్ డౌన్ నిబంధనలు అనుసరించకుండా మరియు ఉన్నతాధికారుల నుండి స్పష్టమైన ఆదేశాలు తీసుకోకుండా ఒక పర్మిషన్ కోసం వచ్చిన దరఖాస్తు పైన పరిమిటెడ్ అని రాసినందుకు మరియు అతని తొందరపాటు చర్యల వల్ల అనవసర గందరగోళానికి దారితీసే పరిస్థితులు ఉన్నందువలన సదరు ఏసీపీ పై తగు క్రమశిక్షణ చర్యలు తీసుకొనుటకై గౌరవ డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి గారికి రిపోర్ట్ సమర్పించడం జరిగింది.ఆ రిపోర్ట్ ఆధారంగా డీజీపీ మహేందర్ రెడ్డి గారు క్రమశిక్షణ చర్యలో భాగంగా సదరు ఏసీపీ ని చీప్ ఆఫీస్ కి టెంపరరీ అటాచ్ చేయడం జరిగింది. అంతే తప్ప,కారు పాస్ ఇచ్చినందుకు ఫ్రీజ్ తీసుకోవడం మరియు దానికి సంబందించిన ఆరోపణలు అన్ని అవాస్తవం.నిజాలు తెలుసుకోకుండా కొంతమంది సోషల్ మీడియాలో దీన్ని వక్రీకరించినట్లు విచారణ లో తెలిసింది అని రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ గారు ఒక ప్రకటన లో తెలిపారు.