Andhra Pradesh

పవన్ కు వెన్నుపోటు టెన్షన్

గుంటూరు, డిసెంబర్ 21 (లొకల్ న్యూస్ )
బీ అలర్ట్.. జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు వెంటనే అప్రమత్తం కావాల్సిన వార్త ఇది. పవన్ కళ్యాణ్‌కు పార్టీలోని కీలక నేత నుంచి ముప్పు పొంచి ఉందని ఓ ఉద్దండుడు హెచ్చరిస్తున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఆయనకు అందిన సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్‌కు వెన్నుపోటు ప్రమాదం ఉంది. జనసేన కోర్ టీంలోని నాదెండ్ల మనోహర్.. పవన్‌ను వెన్నుపోటు పొడిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆయనకు విశ్వసనీయంగా తెలియవచ్చింది. ప్రజాసమస్యలపై పోరాటంలో పవన్ బిజీగా ఉండగా.. వెనుక నుంచి మనోహర్ ఆయనకు వెన్నుపోటు పొడుస్తారని తెలుస్తోంది. ఎప్పుడూ జనసేనాని పక్కనే నవ్వుతూ నిలబడుతున్న నాదెండ్ల మనోహర్ ద్రోహానికి పాల్పడతారనేది ఆయన చెబుతున్న మాట. గతంలో మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర రావు కూడా ఇలాగే ఎన్టీఆర్ పక్కన నిలబడి నవ్వుతూనే వెన్నుపోటు పొడిచిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. దీంతో మనోహర్ విషయంలో పవన్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. పవన్ ఎంత సూపర్ స్టార్ అయినా వెన్నుపోటు నుంచి తప్పించుకోలేరట. ఎన్టీఆరే కాదు పవన్ కళ్యాణ్ కూడా ఇందుకు మినహాయింపేం కాదని పవన్‌ను అమితంగా ఆరాధించే ఆ వ్యక్తి చెప్పాడు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పవన్‌కు చెప్పడంటూ.. ఆయన పవన్ ఫ్యాన్స్‌ను అభ్యర్థించాడు. అంతేకాదు.. నాదెండ్ల వెన్నుపోటు ముప్పు నుంచి పవన్‌ను కాపాడు స్వామీ అంటూ తిరుమల వేంకటేశ్వరస్వామిని ఆయన వేడుకున్నారు. ఏంటి ఇదంతా.. వ్యవహారం కాస్త గజిబిజీగా ఉందే అనుకుంటున్నారా..? నమ్మశక్యంగా లేని ఈ కథను చెప్పింది ఎవరబ్బా? అని తల గోక్కొంటున్నారా? ‘పవన్‌‌కు వెన్నుపోటు కుట్ర’ అనేది రక్త చరిత్ర రాంగోపాల్ వర్మ సృష్టి. జనసేనానిని నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడుస్తాడని ఆయన ముందుగానే హెచ్చరిస్తున్నారు. పైన చెప్పిన మాటలన్నీ ఆర్జీవీ ట్వీట్ల నుంచి జాలువారినవే. ఇదంతా నిజమేనా అనుకుంటున్నారా? ఏ మూలనో డౌట్ కొడుతోంది కదూ.. మీ అనుమానం నిజమే.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’లోని వెన్నుపోటు పాట కోసం పవన్‌ను, ఆయన అభిమానులను వాడుకోవడానికి ఆర్జీవీ వేసిన స్కెచ్ ఇది. దేనికైనా హైప్ రావాలంటే పవన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టాలి. ఇదే వర్మ అనుసరిస్తోన్న వ్యూహం. గతంలో రోడ్డు మీద దుస్తులు విప్పి నానా హంగామా చేసినా శ్రీరెడ్డికి రాని మైలేజీ.. పవన్‌ను ఒక్క బూతు మాట అనడంతో వచ్చింది. అప్పుడు పవన్‌ను తిట్టమని శ్రీరెడ్డికి సలహా ఇచ్చిందెవరో తెలుసు కదా. పబ్లిసిటీ కోసం మరీ ఇంతగా బరి తెగించాలా సామీ..!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close