
Kalinga Times, Vishakapatnam : విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో మంగళవారం రాత్రి మాధవధారలోని ఓ అపార్ట్మెంట్ 201 ప్లాట్‌లో దాడులు నిర్వహించి ఓ మహిళతో పాటూ నలుగురు విటుల్ని అరెస్ట్ చేశారు. వీరిలో జబర్దస్త్ కమెడియన్ దొరబాబు ఉండటంతో బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం దొరబాబుని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అయితే దొరబాబుతో పాటు హైపర్ ఆది టీంలో చేస్తున్న పరదేశి కూడా ఉండటం విశేషం. అయితే వీళ్లు తమను అరెస్ట్ చేయవద్దని పోలీసుల కాళ్లు పట్టుకుంటున్న వీడియో వైరల్ అవుతుంది. ఈ ఇద్దరూ హైపర్ ఆది టీంలో చేస్తుండటంతో షాక్‌లో ఉంది జబర్దస్త్ యూనిట్. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. దొరబాబు, పరదేశి హైపర్ ఆది టీమ్‌లో కంటెస్టెంట్లు అన్న సంగతి తెలిసిందే.