Telangana
ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ కన్నుమూత
Kalinga Times,Hyderabad ; ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ కన్నుమూశారు. గతకొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఈ నెల 6 నుంచి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో.. మంగళవారం ఆయన ఆరోగ్యం విషమించింది. సమాచారం అందుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి జీవిత రాజశేఖర్‌తో పాటు ఉత్తేజ్, మా కార్యవర్గ సభ్యుడు సురేశ్ కొండేటి, టాలీవుడ్‌కు చెందిన పలువురు కమెడియన్స్ హాస్పిటల్‌లో వేణుమాధవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం ఇవాళ మరింత విషమించి.. మధ్యాహ్నం 12.21 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు. ఈయన మృతితో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. వేణు మాధవ్ మృతదేహాన్ని మధ్యాహ్నం కాప్రా హెచ్.పి కాలనీలో స్వగృహానికి తీసుకెళ్లనున్నారు.