Telangana
పదవ తరగతి ఫలితాలలో శ్రీ సిద్ధార్థ హై స్కూల్ విజయకేతనం

Local News India Godavarikhani : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో గోదావరిఖని పట్టణంలోని శ్రీ సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు.దీంతో శ్రీ సిద్ధార్థ హై స్కూల్ విజయ పరంపరలో తన ఆధిపత్యాన్ని ఈ ఏడాదికూడా కొనసాగించింది. ముగ్గురు విద్యార్థులు 10 జి.పి.ఎ తో పాటు ఐదుగురికి 9.8 మరియు 80 మందిలో 34 కు పైగా 9 జి.పి.ఎ పాయింట్లను సాధించి తమ ప్రతిభను చాటారు. ఈ సంధర్భంగా శ్రీ సిద్ధార్థ హై స్కూల్ కరస్పాండెంట్ ఎం విజయానంద్ ,డైరెక్టర్ జి.తిరుపతి లు హర్షం వ్యక్తం చేశారు.
పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సంధర్భంగా కళింగ టైంస్ ప్రతినిధితో శ్రీ సిద్ధార్థ హై స్కూల్ కరస్పాండెంట్ ఎం విజయానంద్ మాట్లాడుతూ మారిన విద్యా విధానానికి అనుగుణంగా సృజనాత్మక ప్రమాణాలతో కూడిన ప్రణాళికను రూపొందించి సిలబస్ కు అనుగుణంగా విభజించి సకాలంలో భోధనను పూర్తి చేయటం తో పాటుగా ప్రిపరేషన్ కు అధిక సమయాన్ని కెటాయిస్తున్నమన్నారు.
అంతే కాకుండా డి.జి తరగతులతో విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంపొందించి వారి సామర్ధ్యాలను పెంపొందించడానికి కృషి చేస్తున్నామన్నారు.కేవలం విద్యపైనే కాకుండా పలు సాంస్కృతిక, క్రీడా రంగాలతో పాటుగా సైన్స్ ఫెయిర్ తదితరాలలో విద్యార్థులను భాగ స్వాములను చేస్తున్నామన్నారు. ముఖ్యంగా అనుభవం గల ఉపాధ్యాయుల పర్యవేక్షణ తోనే ప్రతి ఏడాది తమ విజయ పరంపర కొనసాగుతోందన్నారు. విజయం సాధించిన విద్యార్థులకు మరియు అందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు ఈ సంధర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు