
Kalinga Times,Hyderabad: తెలంగాణ ఉద్యమ నేత, కలంతో పోరాడిన మహావీరుడు నిష్కల్మష పూజితుడు గా యావత్ తెలంగాణ ప్రజల హృదయాలలో నిలిచిన తెలంగాణ పోరు బిడ్డ అని తెలంగాణ బీసీ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కేబి రాజు కొనియాడారు, జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా కేబి రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విభజన కోసం నిధులు నియామకాలు ఉద్యోగాలు త్రాగు సాగునీటి కోసం ఉద్యమాలతోనే గుర్తించిన మహానుభావుడు అని ఆయన అన్నారు, నేడు తెలంగాణ లో అనగారిన బీసీ కులాలకు అన్యాయం జరుగుతుందని, దానిని ఎదుర్కోవడానికి ప్రతి బీసీ కులస్తులు సంఘటితం కావాలని కోరారు, మొన్న జరిగిన ఎన్నికల అనంతరం బీసీల సర్వే కూడా ప్రభుత్వం చేయించిందన్నారు, ఈ సర్వేలో బీసీల సంఖ్య లక్షల్లో ఉందని, ఎక్కువ శాతం బిసిల ఓట్లు మాత్రమే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు, బీసీ కులాలలో ఆకలితో అన్నమో రామచంద్ర అంటూ అల్లాడుతూ రోజు కూలీ పని దొరకక అపార్టుమెంట్ల ముందు సెక్యూరిటీ గార్డులుగా కాపలా కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, త్వరలోనే రంగారెడ్డి జిల్లా పరిధిలోని షాద్నగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, నియోజకవర్గాలలో బీసీలను సంఘటితం చేయడానికి కమిటీలు సన్నద్ధం అవుతున్నాయన్నారు, తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుల పిలుపుమేరకు చేపట్టబోయే కార్యక్రమాలను వారి దృష్టికి తీసుకు వచ్చి కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు, బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఉపాధి చేసుకోవడానికి కిరాణా షాపులు, వివిధ కులాలకు చెందిన పనిముట్లు, అర్హులైన బీసీ విద్యార్థులకు భవిష్యత్తు చదువుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు