Telangana
మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్

Kalinga Times,Hyderabad : తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను చూసి దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా మన సంక్షేమ పథకాలను అవలంబిస్తున్నారని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన73 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ తో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావులు చేసినటువంటి పోరాట ఫలితంగా నేడు ఆ పుణ్య ఫలం మనం పొందుతున్నామని ఆయన అన్నారు. వారు చూపిన అడుగుజాడల్లో మనం ముందుకు వెళ్లాలని, వాళ్లని స్ఫూర్తిగా తీసుకుని మంచి కోసం పోరాటం చేసి చెడుని విడనాడి ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు వివరాలు ను ఆయన వెల్లడించారు. అనంతరం సంక్షేమ పథకాలకు సంబంధించిన వివిధ శకటాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు పలువురు పాల్గొన్నారు.