
Kalinga Times,Godavarikhani : 100 రోజులకు పైగా దీక్షలో ఉండీ , ప్రజా సంక్షేమంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ అందరికి అందుబాటులో ఉన్నశాసన సభ్యులు కోరుకంటి చందర్ సేవలు ప్రశంసనీయమని 12 వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత రవిందర్ అన్నారు. బుధవారం రామాలయం కమిటీ ని అందరికి ఆమోదయోగ్యమైనదిగా ఏర్పాటు చేసినందుకు కృతజ్తలు తెలిపి సన్మానం చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణ లక్ష్మీ , షాధిముభారక్ , ల తో పాటు ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్నవారికి ఎప్పుడు అండగా ఉంటూ cmrf , loc ల ద్వారా అనేక రకాలుగా ప్రజలకు సేవాలందిస్తూనే మరొక పక్క రామగుండం నగర పాలక సంస్థ ను మేయర్ మరియు పాలక వర్గం కు సూచనలిస్తూ నియోజక వర్గాన్ని అభివృద్ధి పథం లోకి నడిపిస్తున్నారన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి KCR గారునాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ లో హాలియా మున్సిపాలిటీ లో ఇంచార్జి గా బాధ్యతలు ఇస్తే అక్కడే ఉండి దీక్షలో ఉండి ఎండను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించారన్నారు. అనంతరం రామాలయం కమిటీ ని అందరికి ఆమోదయోగ్యమైన కమిటీ ని వేసినందుకు మేము 12 వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత రవిందర్ దంపతులు శాలువతో చిరు సత్కారం చేయడం జరిగింది.