social
కలలో దేవుడు జుట్టును కత్తిరించుకోవద్దన్నాడట..
Kalinga Times,Hyderabad : బీహార్‌లోని ముంగేర్‌కు చెందిన 63 ఏళ్ల సకల్ దేవ్ టుడ్డు అనే వ్యక్తికి 40 ఏళ్ల కిందట కలలో దేవుడు కనబడి జుట్టును కత్తిరించుకోవద్దని చెప్పాడట. అప్పటి నుంచి సకల్ దేవ్ జట్టును కత్తరించకుండా, కనీసం దాన్ని శుభ్రం కూడా చేయకుండా తన ఎత్తు కంటే పొడవుగా ఉండే ఈ జట్టును అతడు మడతపెట్టి ఇలా నెత్తిమీద పెట్టుకుంటున్నాడు.
31 ఏళ్లు అటవీ శాఖలో పనిచేసిన ఇతడికి భార్య, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అన్నట్లు జుట్టును శుభ్రం చేస్తే ఓడిపోతుందని భయమనే ఈ వ్యక్తి తనకున్న ఆయుర్వేదంపై పట్టుతో సంతానం లేని జంటలకు ఆయుర్వేద మందులు ఇస్తూ తన జుట్టుకు ప్రత్యేకమైన తైలాలను రాస్తూ అపురూపంగా చూసుకుంటున్నాడు.