Telangana
ఎంపీ సీట్లు గెలవగానే బీజేపీ నేతలు ఆగడం లేదు-కేటీఆర్
Kalinga Times,Hyderabad : బీజేపీ నేతలు నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే ఆగడం లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరిషత్ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఎనిమిది జడ్పీటీసీలు మాత్రమే గెలిచిందని వ్యాఖ్యానించారు. ఎవరి సత్తా ఏమిటో మున్ముందు తెలుస్తుందని తెలిపారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేటీఆర్ అనేక అంశాలపై స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అగ్రభాగాన ఉంటుందన్న కేటీఆర్ రెండో స్థానం గురించి కాంగ్రెస్,’బీజేపీలు తేల్చుకోవాలని అన్నారు. మంచి మున్సిపల్ చట్టం తెచ్చినప్పుడు కచ్చితంగా ఎన్నికల్లో తమకు లాభం కలుగుతుందని అన్నారు. ఏఐసీసీకి ఇప్పుడు అధ్యక్షుడే లేరని అన్నారు. రాష్ట్రంలోని పీసీసీకి కూడా అధ్యక్షుడు లేనట్టే ఉందని సెటైర్ వేశారు.మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు భాద్యత ఎమ్మెల్యేలదే అని కేటీఆర్ స్పష్టం చేశారు. మంచి పాలనా సంస్కరణలు వస్తే ఎమ్మెల్యేలకు గౌరవం పెరుగుతుందని అన్నారు. అసెంబ్లీ ఆమోదించిన కొత్త మున్సిపల్ చట్టం అవినీతిని పారదోలుతుందని అన్నారు. పంచాయతీ రాజ్ ,మున్సిపల్ చట్టం తరహాలో కొత్త రెవెన్యూ చట్టం రాబోతోందని తెలిపారు.కొత్త మున్సిపల్ చట్టం స్ఫూర్తి జీహెచ్ఎంసీకి కూడా ఉంటుందని అన్నారు.