social

ఎనాఫిలిస్‌ అనే దోమ ద్వారా మలేరియా వ్యాప్తి

Kalinga Times,Hyderabad: వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల్లో ప్రధానమైనది మలేరియా. ఎనాఫిలిస్‌ అనే దోమ ద్వారా మలేరియా వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలు మురికి నీళ్లలోనూ, చెత్తాచెదారాల్లోనూ వృద్ధి చెందడమే కాకుండా, నిలువ ఉన్న పరిశుభ్రమైన నీటి మీద కూడా కాపురం చేస్తుంటాయి. ప్లాస్మోడియం అనే ఒక సూక్ష్మక్రిమి వలన మలేరియా వస్తుంది. ఈ సూక్ష్మక్రిమి ఆడదోమ లాలాజల గ్రంథుల్లో నివాసం ఏర్పరచుకుంటుంది. మనిషిని ఆడ దోమ కుట్టినప్పుడు దాని లాలాజలం ద్వారా ఈ క్రిమి మనిషి చర్మంలోకి ప్రవేశించి అక్కడి నుంచి మనిషి రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఈ సూక్ష్మక్రిములు ముందుగా కాలేయంలోకి ప్రవేశించి అక్కడ వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి.

అసంఖ్యాకంగా వృద్ధి చెందిన తరువాత అక్కడి నుండి తిరిగి మనిషి రక్త ప్రవాహంలోకి ప్రవేశించి అక్కడి ఎర్ర రక్తకణాలను నాశనం చేయడం ప్రారంభిస్తాయి. మలేరియా క్రిమి కాలేయంలో ఉన్న దశలో మలేరియా తాలూకు లక్షణాలు మనిషిలో కనిపించవ్ఞ. కానీ, కాలేయం నుంచి రక్త ప్రవాహంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం మొదలెట్టాక మాత్రం విపరీతమైన జ్వరం, చలి మొదలవ్ఞతాయి. మలేరియాతో బాధపడుతున్న వ్యక్తిని ఆడ దోమ కుట్టి రక్తం పీల్చుకుని ఆ తరువాత అది మరొక ఆరోగ్యవంతుడిని కుట్టిందంటే ఆ మనిషికి కూడా మలేరియా సోకుతుంది. మలేరియా క్రిమి కాలేయం నుంచి రక్తంలోకి ప్రవేశించాక అక్కడి ఎర్ర రక్తకణాలు చిట్లడం మొదలవ్ఞతాయి. సరిగ్గా ఆ సమయంలో మనిషిలో 103-104 డిగ్రీల ఫారెన్‌హీట్‌ జ్వరంతో వణుకు మొదలవ్ఞతుంది. రోగికి విపరీతంగా తలనొప్పి ఉండవచ్చు.

వాంతులు మొదలవవచ్చు. చలిని తట్టుకోలేక రోగి దుప్పటి మీద దుప్పటిని కప్పుకోవాలనుకుంటాడు. జ్వరం గరిష్టస్థాయికి చేరుకున్నాక మాత్రమే మనిషిలో చలి తగ్గిపోతుంది. చలి తగ్గిన కొన్ని గంటల తరువాత టెంపరేచర్‌ మళ్లీ మామూలు స్థితికి వచ్చి, చెమటలు పట్టడం ప్రారంభమవ్ఞతుంది. నీరసంగా బలహీనంగా ఫీలవ్ఞతాడు. జ్వరం తగ్గిన ఒకటి నుంచి మూడు రోజుల వరకూ మనిషి మామూలుగానే తిరుగుతాడు. తరువాత మళ్లీ చలి, జ్వరం ప్రారంభమవ్ఞతాయ. మలేరియాలో ఉన్న ముఖ్య లక్షణమేమిటంటే, రోజు విడిచి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి జ్వరం, చలి మొదలు కావడం, కాలేయం నుంచి మలేరియా క్రిములు రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తున్నప్పుడల్లా జ్వరం, చలి మొదలవ్ఞతాయి.

మలేరియా జ్వరం మాటిమాటికీ వస్తుంటే ఆ మనిషిలో ఎర్రకణాలు బాగా క్షీణించి, రోగి రక్తహీనతకు గురవ్ఞతాడు. తీవ్రమైన కేసులలో రోగి కాలేయం, ప్లీహం వాపు చెందుతాయి. మలేరియా సోకకుండా దోమల మందును స్ప్రే చేయడం, దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవడం, ఇంట్లో ఫ్లవర్‌ పాట్స్‌లలో నీటిని ఎప్పటికప్డుఉ మారుస్తుండాలి. నీటి పాత్రల మీద మూతలను గట్టిగా బిగించి ఉంచాలి. ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి ఆ నీటిని మారుస్తుండాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూడాలి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close