Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా బిశ్వ భూషణ్ హరిచందన్
Kalinga Times,New Delhi :ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా బిశ్వ భూషణ్ హరిచందన్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. బిశ్వ భూషణ్ సుదీర్ఘకాలంగా సంఘ్‌పరివార్‌తో అనుబంధం కలిగివున్నారు. 1988 నుంచి బీజేపీలో క్రియాశీలంగా ఉంటూ రచయితగా అనేక పుస్తకాలు రాశారు. అవినీతిపై పోరు, మొక్కల పెంపకంపై ఆయనకు ఎనలేని ఆసక్తి ఉంది.ఇదిలా ఉంటే.. తెలంగాణకు నరసింహన్‌నే కొనసాగిస్తారా..? లేకుంటే కొత్త గవర్నర్‌ను నియమిస్తారా.? అనేదానిపై స్పష్టత రాలేదు.