social
తెలంగాణ పవర్ గ్రిడ్‌కు ఏ సమస్య రాకుండా అప్రమత్తం
ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు వివరణ

Kalinga Times , Hyderabad : లైట్లు ఆర్పేస్తే గ్రిడ్ కుప్పకూలుతుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభాకర్ రావు కొట్టి పారేశారు. పవర్ గ్రిడ్‌పైన లోడ్ పడే మాట వాస్తవమేనని, అయితే, ఏ సమస్యా రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. పవర్ గ్రిడ్‌కు ఏ సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నామని ఆయన చెప్పారు. కరోనా కట్టడికి ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును ప్రజలంతా విజయవంతం చేయాలని ప్రభాకర్ రావు సూచించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గ్రిడ్‌కు ఎలాంటి సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నామన్నారు. కరోనాపై భారత్ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఆకస్మికంగా అందరూ స్విచ్ ఆఫ్ చేస్తే తెలంగాణ గ్రిడ్ కూడా కూలిపోయే ప్రమాదముందని అధికారులు అన్నట్లుగా కొన్ని వార్తా సంస్థలు రాశాయి. తెలంగాణ విద్యుత్తు ఇంజనీర్లు సైతం ఆందోళన వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పవర్ గ్రిడ్‌పై పడే ప్రభావం గురించి జెన్ కో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు వివరణ ఇచ్చారు.