social
ప్రియాంక 75 అడుగుల రాల్ఫ్ వేల్ డ్రెస్
ముంబై, లోకల్ న్యూస్ : బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ల పెళ్లి ఫొటోలు బయటకు వచ్చాయి. ప్రియాంక తమ పెళ్లి ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. తొలుత డిసెంబర్ ఒకటో తేదీన క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఒక్కటైన ఈ ప్రేమ జంట, 2వ తేదీన హిందూ సంప్రదాయంలో రెండోసారి వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నవ వధువుగా ప్రియాంక 75 అడుగుల రాల్ఫ్ వేల్ డ్రెస్ ధరించిన ఫొటో అందర్నీ ఆకర్షిస్తోంది. ఐదు మంది ఆమెకు సహాయం చేయగా ప్రియాంక వివాహ వేదిక వద్దకు వచ్చారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో కేవలం కొంతమంది సన్నిహితులు, కుటుంబసభ‍్యుల మధ్య సినిమాను తలపించే రీతిలో వీరి వివాహ వేడుకలు జరిగాయి. క్రైస్తవ సంప్రదాయం జరిగిన వివాహంలో ప్రియాంక వైట్ డ్రెస్‌లో, నిక్ బ్లాక్ సూట్‌లో దర్శనమిచ్చాడు. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన వివాహంలో రెడ్ డ్రెస్‌లో నవ వధువు ప్రియాంక మెరిసిపోయారు. ఇప్పటివరకూ కేవలం సంగీత్, మెహందీ ఫొటోలును షేర్ చేసిన ప్రియాంక, నిక్‌లు తమ పెళ్లి ఫొటోలను మాత్రం కాస్త ఆలస్యంగా తమ ఫాలోయర్లతో షేర్ చేసుకున్నారు.