social

భారత్ జట్టు 4 వికెట్ల తేడాతో అలవోక విజయం

Kalinga Times,Hyderabad: అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా శనివారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ జట్టు 4 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. తొలుత ఫాస్ట్ బౌలర్లు నవదీప్ షైనీ (3/17), భువనేశ్వర్ కుమార్ (2/19) దెబ్బకి వరుసగా వికెట్లు చేజార్చుకున్న వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులకే పరిమితమవగా.. ఛేదనలో రోహిత్ శర్మ (24: 25 బంతుల్లో 2×4, 2×6), విరాట్ కోహ్లీ (19: 29 బంతుల్లో 1×4), మనీశ్ పాండే (19: 14 బంతుల్లో 2×4), కృనాల్ పాండ్య (12: 14 బంతుల్లో 1×4) తలో చేయి వేయడంతో మరో 16 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది. ఇక రెండో టీ20 మ్యాచ్ ఆదివారం రాత్రి 8 గంటలకి ఫ్లోరిడాలోనే జరగనుంది. అరంగేట్రం మ్యాచ్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నవదీప్ షైనీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close