Telangana
తెలంగాణ ధనాన్ని కేసీఆర్ దోచుకుంటున్నారు
Kalinga Times,Hyderabad : కొత్త ప్రాజెక్టు ల పేరు మీద తెలంగాణ ధనాన్ని కేసీఆర్ దోచుకుంటున్నారని మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు.జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల,నెట్టెంపాడు ప్రాజెక్టును ఆమె సందర్శించి, పరిశీలించారు.ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టుల పేర్లతో డిజైన్లులను మారుస్తూ కోట్ల రూపాయల వృధా చేస్తున్నారని ఆమె విమర్శించారు..నెట్టెంపాడు ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏడూ ఏళ్లు పట్టింద అని ప్రశ్నించిన కేసీఆర్,పెండింగ్ లో ఉన్న 5 సంవత్సరాలైన పూర్తి చేయడానికి చేతకాలేదని కేసీఆర్ ని ప్రశ్నించారు.కృష్ణమ్మ దయతో జూరాల కు నీరు వచ్చాయని,ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ నాయకులు చేసింది ఏమి లేదని,రిజర్వాయర్ దగ్గరకు వచ్చి ఫోజులు తప్ప రైతులకు చేసిందే ఏమి లేదని అన్నారు..కేసీఆర్ కు కాళేశ్వర్ ప్రాజెక్టు మీద ఉన్న ప్రేమ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ల మీద లేదని ఆవేదన వ్యక్తం చేశారు.నా హయాంలో నెట్టెంపాడు లిఫ్ట్ పూర్తి చేయడం వల్ల రైతులకు సాగు నీరు అందుతున్నాయని అన్నారు.ఒక వేళ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ఇక్కడ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేదని అన్నారు.