Andhra Pradesh
విభజన హామీలపై కేంద్ర మంత్రులతో జగన్ భేటి

Kalinga Times, New Delhi : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రేపటి రాష్ట్రంలో షెడ్యూల్ కూడా రద్దు చేసుకున్న జగన్ తాజాగా హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇప్పటికే పలువురు మంత్రులను కలిసి ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించిన సీఎం విభజన హామీలను నెరవేర్చాలని అమిత్ షాను కూడా కోరారు. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీలో వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయాలని కోరగా అమరావతి-అనంతపూర్ ఎక్స్‌ప్రెస్ హైవేకు కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలని గడ్కరీని జగన్ కోరారు.కాగా,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ్టి పర్యటనలు వాయిదా పడ్డాయి. కడప, అనంతపురం జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం ఢిల్లీలోనే ఉండాల్సి రావడంతో ఈ పర్యటనలు సెప్టెంబర్ నెల 1, 2 తేదీలకు వాయిదా పడింది.