social
ఏప్రిల్ 6న ‘ప్రేమకథా చిత్రమ్ 2’

Local హారర్ కామెడీ చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్ 2’. సుమంత్ అశ్విన్, సిద్ది ఇద్నాని జంటగా నటిస్తున్నారు.
హరికిషన్ దర్శకత్వంలో సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాకు ఇది సీక్వెల్. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. యు/ఏ సర్టిఫికెట్ పొందింది. ఇందులో నందిత శ్వేతా కీలక పాత్రలో నటిస్తోంది. రావు రమేష్ వాయిస్ ఓవర్‌తో కథనం నడుస్తుంది. ఉగాదికి ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
”ప్రేమకథా చిత్రమ్ మాదిరిగానే ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని” చిత్ర నిర్మాత సుదర్శన్ రెడ్డి వ్యక్తం చేశారు. ”అన్ని కార్యక్రమాలు పూర్తిచేశాం. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 6న సినిమాను విడుదల చేస్తున్నాం” అని ఆయన తెలిపారు.