National
మోదీ మహిళల కోసం ‘ఉచిత స్కూటీ’ అసత్య ప్రచారమే

Kalinga Times,Hyderabad : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహిళల కోసం ‘ఉచిత స్కూటీ’ పథకాన్ని ప్రారంభించారంటూ కొన్ని రోజులుగా ఓ ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ప్రకటన ఓ అసత్య ప్రచారమని అధికారులు స్పష్టం చేశారు. పదోతరగతి ఉత్తీర్ణులై.. 18-40 ఏళ్ల వయసున్న మహిళలు దరఖాస్తు చేసుకోవాలంటూ ఆ ప్రకటన వైరల్ కావడంతో దరఖాస్తుల కోసం మీసేవ కేంద్రాలకు తాకిడి పెరిగింది.అలాంటి పథకమేమీ లేదని మహిళాశిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేంద్ర బోయి స్పష్టం చేశారు.