Telangana

అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయకపోవటం నాయకుల చేతకానితనానికి నిదర్శనం

 సీపీఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్

ఏ పోరాటం ఏ ఉద్యమం అయిన ఉవ్వెత్తున ఎగిసి పడుతూ, ఊహించని రీతిలో ఉద్యమాలు ప్రారంభం అవుతాయి.

రాష్ట్ర సాధనలో బలిదానాలు చేసుకున్నవారికి గౌరవం లేదు, రాష్ట్ర సాధన అనంతరం ఏడేళ్లు గడుస్తున్న  ఈ ప్రాంతంలో అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయకపోవటం నాయకుల చేతకానితనానికి నిదర్శనం..

రామగుండం నియోజకవర్గంలో ఉద్యమ నాయకులు అని చెప్పుకొని తిరిగే నాయకులకు తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది విద్యార్థి యువత రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసుకొన్న వారి శవాల మీద  రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చి వారు మృతి చెందితే ఏడేళ్లు గడుస్తున్నా కనీసం వారి గుర్తుగా  స్మారక చిహ్నం, అమరవీరుల స్థూపం గోదావరిఖనిలో ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని  సీపీఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానిక నాయకులు ఇంటిపేరే ఉద్యమ నాయకులమని పదే పదే చెప్పేవారు రాష్ట్ర సాధన ఉద్యమంలో మృతి చెందిన వారికి గౌరవం ఏదని తెలంగాణ వాదులు ఆవేదన చెందుతున్నారని , ఇప్పటికైనా  ఖనిలో అమరవీరుల  స్థూపం ఏర్పాటు చేయాలేని  మృతులు స్మరించుకోలేని  నాయకులకు ఉన్నత పదవులు ఉన్న, లెన్నట్టే అని వాపోయారు.

ఇకనైనా తెలంగాణ అస్తిత్వాన్ని తెలియచెప్పే విధంగా అమరుల త్యాగాలను బావి తరాలకు స్ఫూర్తినిచ్చే కార్యాచరణ చేపట్టి అమర వీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయాలని మద్దెల దినేష్ కోరారు.రామగుండం నగర పాలక సంస్థ లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు సాగిన  ఉద్యమంలో పోరాటల ఖిల్లా కరీంనగర్ జిల్లా గోదావరిఖని కి ప్రత్యేక స్థానం ఉంది, ఉద్యమాల గడ్డ .విప్లవాల గని గోదావరిఖని .రాష్ట్ర అవిర్భావంలో ఖనికి ప్రత్యేక స్థానం ఉంది, ఏ ఉద్యమం మొదలు కావాలన్న ఇక్కడి నుండే ప్రారంభం కావాలి, సకల జెనుల సమ్మె అయితే రాష్ట్రం తో పాటు  దేశాన్నే కుదిపేసింది అన్నారు. రాష్ట్ర సాధన అనంతరం మృతి చెందిన వారికోసం ఆయా జిల్లా, మండల గ్రామ లలో పట్టణ కేంద్రాలలో వారి గుర్తుగా స్మారక చిహనాలు, అమరవీరుల స్థూపాలు నుర్మించుకున్నారు, అయితే రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు పోరాటాల చేసి అసువులు బాసిన విద్యార్థి, యువత  వీర మరణం పొందిన వారికి కనీసం గోదావరిఖనిలో లో అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి. రాష్ట్రం అవిర్భవించిన్నప్పటి నుండి దాదాపు ఏడేళ్ల నుండి ఎఐవైఎఫ్ – సిపిఐ గా పోరాటాలు, నిరసనలు, విజ్ఞాపణలు, చేస్తున్న అమరవీరుల స్థూపం నిర్మించకపోవడం విచారకరం అన్నారు. పదే పదే ఉద్యమ నాయకులు అని చెప్పుకొని  ప్రచారం చేసుకునే ప్రజా ప్రతినిధులకు అయితే చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం సిగ్గు చేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి ఏడేళ్లు  పూర్తవుతున్న సందర్భంగా, జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రాష్ట్ర సాధన కోసం అమరులైన వారికోసం గుర్తుగా గోదావరిఖనిలో అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేస్తే మృతి చెందినవారికి, మరియు వారి కుటుంబాలకు , బావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు .ఉద్యమ స్పూర్తిని తెలిపేలా నిర్మాణం జరగాలని  తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించాలని త్యాగాలు చేసిన అమరవీరుల త్యాగనిరతిని భవిష్యత్‌ తరాలు తలుచుకునేలా స్మృతి చిహనంగా అమరవీరుల స్థూపం నిర్మాణం జరగాలని డిమాండ్ చేసిన స్థానిక ముఖ్య ప్రజా ప్రతినిధులకు పట్టింపు లేదన్నారు. ఇంకో పదేండ్లు అయిన అమరవీరుల త్యాగాలు స్థానిక ప్రజా ప్రతినిధులు గుర్తించరు, వారికి సొంత ప్రయోజనాలు, ప్రజలకు అవసరం లేని కార్యక్రమాలు చేసుకుంటూ ,వారి పై ఉన్న పెద్ద నాయకుల దగ్గర మెప్పు పొందడానికే తప్ప, తప్ప దేనికి పనికి రారు అని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు.. ఫోటోలు, సెల్ఫీలు, వాట్స్ ప్, ఫేస్ బుక్ లు, ట్వీటర్లలో అభివృద్ధి చేస్తున్నాం అంటారు తప్ప  బైట కనపడదు అన్నారు. ఏది ఏమైనా అమరవీరుల స్థూపాన్ని ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు వారికి నిర్మించక పోవడం బాధాకరం అన్నారు. ఇకనైనా తెలంగాణ అస్తిత్వాన్ని తెలియచెప్పే విధంగా అమరుల త్యాగాలను బావి తరాలకు స్ఫూర్తినిచ్చే కార్యాచరణ చేపట్టి అమర వీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయాలని మద్దెల దినేష్ కోరారు. 

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close