Telangana
కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.

మృతి చెందిన జర్నలిస్టులకు 25 లక్షలు ఎక్స్గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి
షేక్ టైగర్ అలీ నవాబ్,టీడబ్ల్యూజేఏ & ఎన్డబ్ల్యూజేఏ రాష్ట్ర మరియు జాతీయ అధ్యక్షుడు డిమాండ్
Kalinga Times, Hyderabad : ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ నిరంతరం ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తూ, కరోనా విజృంభిస్తున్నా ప్రస్తుత తరుణంలో కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ,రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి చనిపోతున్నారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల మరియు నేషనల్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు షేక్ టైగర్ అలీ నవాబ్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరోనా బారిన పడి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకొని ఒక్కొక్క జర్నలిస్టుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వము వెంటనే ప్రకటించాలని డిమాండు చేశారు.మృతి చెందిన జర్నలిస్టులకు సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.రాష్ట్రంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడియేషన్ కార్డులతో సంబంధం లేకుండా ఆయా సంస్థ యాజమాన్యం జారీ చేసినటువంటి గుర్తింపు కార్డులను పరిగణనలోకి తీసుకొని వారికి కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించి వారి కుటుంబాలకు అండగా ఉండాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబాలకు మీడియా అకాడమీ నుంచి సైతం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డుతో ముడి పెట్టకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం అందించాలని, జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి ప్రత్యేక వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు….