Telangana
సామాన్యులకు గుదిబండగా విద్యుత్ బిల్లులు- ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ
కళింగ టైంస్, గోదావరిఖని : కొవిడ్-19తో దినదినగండం నూరేళ్ళ ఆయుష్షులా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సామాన్య, పేద ప్రజలపై ప్రభుత్వం విద్యుత్ భారం మోపిందని నెల బిల్లులు చెల్లించడమే భారమని భావిస్తున్న ఈ తరుణంలో విద్యుత్‌శాఖ అధికారులు అదనపు డెవలపుమెంట్ చార్జీలను వేసి షాక్ కుచేస్తొందంటూఅని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నేతృత్వంలో శారదా నగర్లో విద్యుత్ కార్యాలయంలో శుక్రవారం రోజున ఎస్ఈ సంపత్ గారికి వినతి పత్రం ఇచ్చారు.
అనంతరం ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్, ఉపాధ్యక్షులు కొమ్మ చందు యాదవ్ లు మాట్లాడుతూ రెండు నెలల నుంచి వస్తున్న బిల్లులను చూసి వినియోగదారులు లబోదిబోమంటున్నారని వెంటనే ఆదనపు చార్జీలు మోత ఊపసంరించుకోవాలన్నారు.
నెల బిల్లుల్లోనే అదనపు డెవలప్‌మెంట్ చార్జీలను కూడా కలిపి వేయడంతో నెలకు 500లోపు వచ్చే బిల్లులు ఇప్పుడు వేలల్లోనే ఉండడంతో షాక్‌లో నుంచి తేరుకోలేక పోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కోతలు లేకుండా నిరంతరం విద్యుత్‌ను అందిస్తున్నామని, రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెబుతూనే వినియోగదారుల పై ఇలా అదనపు డెవలప్‌మెంట్ చార్జీలు, అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్లు, జీఎస్‌టీ తదితర చార్జీల భారం మోపడం సరైంది కాదని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
వినియోగదారుల ఆవేదన
ప్రతి నెలా బిల్లుల్లో ఎనర్జీ చార్జీలు, కస్టమర్ చార్జీలు, ఈడీ, ఈడీ వడ్డీ, అడిషనల్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్, డెవలప్‌మెంట్ చార్జీలు ఇలా ఏవోవే కలిపి బిల్లులు ఇస్తున్నారని, 15 రోజుల్లో బిల్లులు చెల్లించనట్లయితే డిస్‌కనెక్షన్ చార్జీలను కూడా వసూలు చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు అని అన్నారు. ప్రతినెలలో 30 రోజులకొకసారి మీటరు రికార్డు చేసి బిల్లులను ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు ఒకసారి 30 రోజులలోపే, మరోసారి 30 రోజుల తర్వాత బిల్లులు ఇస్తున్నారని, దీనితో యూనిట్ స్లాబ్ మారి పోయి అదనంగా ఆర్థికభారం మోపుతున్నారన్నారు.
పెరుగుతున్న వినియోగాన్ని బట్టి అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లను నెలకొల్పి విద్యుత్ ఇవ్వాల్సింది పోయి ఇలా పెరుగుతున్న లోడ్‌కు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తామంటూ అదనపు చార్జీలను వసూలు చేయడమేమిటని నిలదీశారు. గత ఏడాదినుంచి కరోనాతో కకలావికలమై ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు చార్జీల మోతలను, జీఎస్‌టీలను వేయడం సరికాదని, ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు డిమాండ్ చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గడప శ్రీకాంత్, ఉపాధ్యక్షులు మాదిరెడ్డి నాగారాజ్, సహాయ కార్యదర్శి ఎం. శ్రీనివాస్ తో పాటు వినయ్, రాజ్ తదితరులు పాల్గొన్నారు.