Telangana
గోదావరిఖనిలోని శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా కల్యాణోత్సవం
కేసీఆర్ కారోనా నుండి త్వరగా కోలుకోవాలి -ఎమ్మెల్యే కోరుకంటి చందర్
Kalinga Times,Godavarikhani : రామగుండం ప్రజలందరిపై శ్రీ సీతారాముల ఆశీస్సులు ఉండాలని ,ప్రజలందరూ సుఖ సంతోషోలతో వర్దిలేలా సీతారాములు ఆశీర్వదించాలనీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం శ్రీ రామనవమి సందర్భంగా గోదావరిఖని పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో జరిగిన సీతారామ కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే పట్టువస్త్రాలను, తలంబ్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం ఎంతో వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం కరోనా కారణంగా సామూహికంగా జరుపలేకపోతున్నమని అన్నారు. సీతారామ కల్యాణ మహోత్సవాన్ని కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహించండం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలను ఇవ్వడానికి సిద్దపడ్ద మహనేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడటం బాధకరమన్నారు. కేసీఆర్ కారోనా నుండి త్వరగా కోలుకోవాలని సీతారామలుతో పాటు సకల దేవతలను ఎమ్మెల్యేగారు వేడుకున్నారు. ఈ కల్యాణోత్సవంలో నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, టీఆరెస్ కార్పోరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కోదండ రామాలయం చైర్మన్ రవీందర్ రావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..