Telangana
కన్నాల గ్రామ పంచాయతీ బోడగుట్టపల్లెలో ఘనంగా శ్రీ రామనవమి ఉత్సవం
సర్పంచ్ మల్క చంద్రకళ రామస్వామి
Kalinga Times,Godavarikhani : కన్నాల గ్రామ పంచాయతీ బోడగుట్టపల్లెలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవానికి సర్పంచ్ మల్క చంద్రకళ రామస్వామి హాజరై పట్టువస్త్రాలను, తలంబ్రాలు అందించారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… సీతారామ కల్యాణ మహోత్సవాన్ని కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహించండం జరిగిందన్నారు.ఆ కోదండరాముని ఆశీస్సులతో ప్రజలందరూ కరోనా మహమ్మారిని జయించి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని,పాడి పంటలు బాగా పండాలని, అదేవిధంగా తెలంగాణ సంక్షేమ రథ సారథి కేసీఆర్ గారు కారోనా నుండి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా శ్రీరాముడిని వేడుకున్నానని అన్నారు. ఈ కల్యాణోత్సవంలో ఆంజనేయ స్వామి మాలలు ధరించిన స్వాములు, అయ్యగారు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.