Kalinga Times,Godavarikhani : నివాస ప్రాంతాలలో సెల్ టవర్ పెట్టడం వలన రేడియేషన్ ప్రమాదం, ప్రజల పై ప్రభావం ఎక్కువగా ఉంటుందని సంబంధిత అధికారులకు తెలియదా అంటూ ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్, ఉపాధ్యక్షులు మాదిరెడ్డి నాగారాజు లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోదావరిఖనిలోని స్థానిక శారదా నగర్ లోని సింగరేణి స్థలం లో అధికారుల అనుమతి తో ఇళ్ళ మధ్యన సెల్ టవర్ సంస్థ నిర్వాహకులు టవర్ను నిర్మాణము చేయడం శోచనీయం. చుట్టూ ప్రహరీ గోడ ఉండడం వలన టవర్ నిర్మాణ పనులు పూర్తయ్యేవరకు ప్రజలకు తెలియకుండా జరిగిపోయింది అని స్థానిక ప్రజలు సింగరేణి అధికారులును కలిసి విన్నవిస్తే మా చేతుల్లో ఏమి లేదు అది సి & ఎండి పర్మిషన్ ఇచ్చారని నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తున్నారని విమర్శించారు. టవర్ వేసిన చోట సి అండ్ ఎండి ఉంటారా లేక ప్రజలు నివసిస్తున్నారా అని ప్రశ్నించారు.
జనావాసాల మధ్య సెల్‌టవర్లతో మాత్రం ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ మూలంగా శారీరక రుగ్మతలకు గురవుతారని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. సెల్‌టవర్‌కు ఐదు వందల మీటర్ల దూరం వరకు దీని ప్రభావం అధికంగా ఉంటుంది. పిచుకలు, పక్షులకు కూడా ముప్పు ఏర్పడుతుంది.
సెల్‌టవర్లు ఏర్పాటు చేయాలంటే మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతి పొందాలి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి అనుమతి పొందాలి ( జీవో నెంబరు 183). అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరిగినా తమదే బాధ్యత అంటూ పూచీకత్తు ఇవ్వాలి. ఈ ప్రాంతంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ ప్రధాన ప్రాంతీయ ఆసుపత్రి కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆసుపత్రికి గర్భిణులు చేకప్ కొరకు వస్తుంటారు. ప్రసావాలు కూడా జరుగుతుంటాయి. అనారోగ్యులు, డయాల్సిస్ పేషేంట్స్, కరోనా పేషేంట్స్, ఒళ్ళు కాలినవాళ్ళు ఇలా ఎంతో మంది ఆసుపత్రికి వస్తుంటారు. వారి పైన రేడియేషన్ ప్రభావము ఎక్కువగా ఉంటుంది.
సింగరేణి మరియు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుకలు చొరవ తీసుకుని సెల్ టవర్ అక్కడి నుండి వెంటనే తొలగించాలి అని ఫైట్ ఫర్ బెటర్ సోసైటీ నాయకులు డిమాండ్ చేసారు. లేనియెడల స్థానిక ప్రజలను కలుపుకొని తొలగించే వరకు ఆందోళనలు తెప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులుమాదిరెడ్డి నాగరాజు, ప్రధాన కార్యదర్శి గడప శ్రీకాంత్, సీనియర్ సిటిజన్ ఎల్.రాజయ్య, మండల శ్రీనివాస్ మరియు వినయ్, స్థానికుల తో పాటు తదితరులు పాల్గొన్నారు.