Religious
నిరాడంబరంగా భద్రాద్రిలో రాములోరి కళ్యాణం
Kalinga Times,Hyderabad : కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భద్రాద్రిలో సీతారాముల కల్యాణోత్సవం భక్తులను అనుమతించలేదు. ఉదయం 10.30 గంటలకు స్వామివారి కల్యాణఘట్టం ప్రారంభం అయ్యింది. కరోనా నిబంధనల దృష్ట్యా భక్తులకు అనుమతిని నిరాకరించారు. సీతారాములకు ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాముల కల్యాణ మహోత్సవానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కొద్ది మంది అథితులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కొందరు అర్చక స్వాములు రామయ్య తరఫున, మరికొందరు అర్చకులు సీతమ్మ తరఫున ప్రతినిధులుగా వ్యవహరించి ఎదుర్కోలు ఉత్సవాన్ని కనుల పండువగా జరిపారు. రేపు శ్రీరాముని మహాపట్టాభిషేకం జరగనుంది. కోవిడ్ కారణంగా ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు నిలిపివేశారు.