Telangana
ప్రజలు ఆందోళన, చెందాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే- కోరుకంటి చందర్
Kalinga Times,Godavarikhani : ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతున్నది ప్రజలు భయం ఆందోళన చెందవద్దని మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం శానిటైజర్ సబ్బు నీటితో శుభ్ర పరచుకోవడం స్వీయ నియంత్రణ చర్యలు పాటించి కరోనా బారిన పడకుండా ఉండవచ్చని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం రామగుండం నగర మేయర్ అనిల్ కుమార్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో కలిసి రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెకండ్ వేవ్ కరోనా వ్యాధి నివారణకు రామగుండం నగరపాలక సంస్థ ప్రణాళికబద్ధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ వాహనాలతో మైకుల ద్వారా వాడవాడలా ప్రచారం చేస్తూ అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. నగర పాలక సంస్థలు టోల్ ఫ్రీ నెంబర్ 18004257062 తో పాటు ప్రత్యేకంగా కోవిడ్ కోసం గత సంవత్సరం నుండి హెల్ప్ లైన్ నెంబర్ 9392483959 ఏర్పాటుచేసి నిరంతరం సేవలు అందిస్తున్నామన్నారు.నగరంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ బృందాలు ఏర్పాటు చేసి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతున్నది. స్వచ్ఛ ఆటో ట్రాలీ 50, కంపక్టర్ వాహనం, బీన్స్, పోర్టబుల్ కంపక్టర్-2, హుక్ లోడర్ వాహనం, స్వీపింగ్ వాహనం యంత్రం కరోనా వైరస్ తో మృతి చెందిన వారికి నిబంధనల ప్రకారం సుశిక్షితులైన వారితో అంత్యక్రియలు నిర్వహించడానికి స్మశాన వాటిక లో తగు ఏర్పాటు చేయడం జరిగిందని భవిష్యత్తులో దురదృష్టవశాత్తు మృతదేహాల సంఖ్య పెరిగిన మున్సిపల్ కార్పొరేషన్ అందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు కొత్తగా రెండు వైకుంఠ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు నగరంలో సరఫరా అవుతున్న మంచినీరు కలుషితం కాకుండా ప్రత్యేక శ్రద్ధతో ప్రతిపాదికన లీకేజీ లను గుర్తించి సరి చేయడం జరుగుతుందన్నారు మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న రక్షిత మంచినీరు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా బి పవర్ హౌస్ గుట్టమీద అ తిరిగి క్లోరినేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక రావు తో పాటు సంబంధిత అధికారులు కార్పొరేటర్లు పాల్గొన్నారు.