ఆయన తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు..ఆ తరంలో ఉద్యమ వీరునిగా సాహసోపేతమైన వ్యూహాలతో నిరసన సెగల కాక పుట్టించి ఎందరో యువకులను ప్రభావితం చేశాడు.. వేద ప్రకాష్ లాంటి వాళ్ళకు గురుతుల్యులు…ఇప్పటి వరకు ఎలాంటి పదవులను ఆశించని నిఖార్సైన నాయకుడు..
Kalinga Times,Bhadrachalam :పదవులు ముఖ్యం కాదు తెలంగాణ రావడం ముఖ్యమని భావించి తెలంగాణ సాధనకోసం కృషి చేసినవారికి తన చేయూతనిస్తూ.. ఏడు పదుల వయసును దాటేశారు..ఊపిరి పోయెంత వరకు తెలంగాణ అభివృద్దికి తన శాయశక్తులా సహకారం అందిస్తామంటున్నారు.ఆయనే తిప్పని సిద్దులు..భద్రాద్రిలో రాముని భక్తుడు ఆంజనేయుడిలా .. తెలంగాణ భక్తుడు తిప్పన సిద్దులతో కళింగ టైంస్ ముఖాముఖి..