Religious
ప్రపంచానికి క్రీడా శక్తిని చాటిన ఘనత క్రికెట్ సొంతం – ఏసీపీ బాలరాజు , ఇన్ స్పెక్టర్ రమేష్ బాబు
ప్రపంచానికి క్రీడా శక్తిని చాటిన ఘనత క్రికెట్ సొంతం అని క్రీడలు శరీర దృఢత్వానికి దోహదపడతాయని మానసిక ఉత్తేజాన్ని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు , ఇన్ స్పెక్టర్ రమేష్ బాబు లు పేర్కొన్నారు.
Kalinga Times, Godavarikhani : గోదావరిఖని లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నరహరి ప్రీమియర్ లీగ్ 2020 క్రికెట్ టోర్నమెంట్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు , ఇన్ స్పెక్టర్ రమేష్ బాబు శనివారం నాడు జరిగిన ప్రి సెమీ ఫైనల్ మ్యాచ్ లకు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ వ్యాయామం తో పాటు క్రీడలు ఆడాలని అన్నారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి రోజు ఒక గంట సమయం మైదానంలో గడపాలని తెలిపారు. రాబోవు రోజుల్లో నరహరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఆలయ ఫౌండేషన్ బాధ్యులు 32 వ డివిజన్ కార్పొరేటర్ అయిత శివ కుమార్ మరిన్ని ఆటల పోటీలు నిర్వహించాలని తద్వారా క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా క్రీడాకారులకు టోర్నమెంట్ నిర్వాహకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతోపాటు , ఆల్ ది బెస్ట్ తెలియజేశారు అనంతరం రాగుల కిరణ్, ఎంబాడీ రవివర్మ చేతుల మీదుగా ముఖ్య అతిథులకు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ బాయ్ శ్రీనివాస్, ఆలయ ఫౌండేషన్ సభ్యులు శరత్, దేవా తదితరులు పాల్గొన్నారు