Telangana
గాంధీ, యశోద ఆస్పత్రితో పాటు తిలక్ నగర్ పీహెచ్‌సీలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ డ్రైరన్
తెలంగాణలో రెండు జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ డ్రైరన్ కొనసాగుతోంది.
Kalinga Times,Hyderabad : హైదరాబాద్ నగరంలో మూడు సెంటర్లలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహిస్తున్నారు. గాంధీ, యశోద ఆస్పత్రితో పాటు తిలక్ నగర్ పీహెచ్‌సీలో డ్రైరన్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఒక్కో సెంటర్‌లో 25మంది హెల్త్ వర్కర్లకు డమ్మీ వ్యాక్సినేషన్ ఇవ్వనునున్నారు అధికారులు. దీనికోసం అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు, ఏర్పాట్లు పూర్తి చేశారు.
వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తినా,అనారోగ్యానికి గురైన వారిని వెంటనే అటాచ్ చేసిన హాస్పిటల్‌కు తరలించి అవసరమైన చికిత్స అందివ్వనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైద్య అధికారులు తెలిపారు. ప్రతి డ్రైరన్ కేంద్రంలో 25 మంది ఆరోగ్య కార్యకర్తలను గుర్తించారు.. వారి డేటాను కోవిన్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఒకవేళ వారికి ఏవైనా సైడ్‌ఎఫెక్ట్స్ వస్తే రెండో వ్యాక్సినేటర్ ఆఫీసర్ కోవిన్ యాప్ సైట్ ద్వారా రిపోర్ట్ చేస్తారు. ఫిర్యాదులుంటే 104 లేదా 1075కు ఫోన్ చేసి సమాచారం అందిస్తారు.