Telangana
సి.పి.ఐ ఆధ్వర్యంలో తబిత ఆశ్రమంలో నూతన సంవత్సర వేడుకలు
వేడుకల పేరుతో వృధా ఖర్చులు చేయడంకన్నా సామజిక కార్యక్రమాలలో పాల్గొని తోచిన సహాయం చేయడం మేలని సీపీఐ నేత మద్దెల దినేష్ అన్నారు.
Kalinga Times,Godavarikhani : నూతన సంవ్సరం వేడుకలు రామగుండం తబిత ఆశ్రమం లో సీపీఐ నేత మద్దెల దినేష్ గారి నేతృత్వంలో ఘనంగ నిర్వహించడం జరగింది. అనంతరం వారు మాట్లాడుతూ పాత జ్ఞాపకాలు మననం చేసుకుంటూ నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలని పిల్లలకు పిలుపునిచ్చారు. ఆశ్రమంలో నేడు విద్యార్థులే అయినా రేపటి మేధావులుగా రూపుదిద్దుకోవాలన్నారు. ఇలాంటి వారికోసం సేవ దృక్పదం కల్గిన వారు వారుకి తోచిన సహాయం చేయాలని కోరారు. వృధా ఖర్చులు చేయడం కన్నా పిల్లలకు ఏదో ఒక వస్తువు రూపకంగా సహాయం చేయవచ్చు అన్నారు. పిల్లలు కు తమ వంతు నిరంతరం సహయ సహకారాలు ఉంటాయని అని తెలిపారు. అనంతరం నూతన్ సంవత్సర వెడుకలు సందర్భంగా కేకే కట్ చేసి పిల్లలకు పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐఎస్ ఎఫ్ నాయకులు రెనికుంట్ల ప్రితం, మదిరెడ్డీ భాస్కర్ రావ్, ఇందుమతి చర్టిబలే ట్రస్ట్ నిర్వాహకులు నాగరాజ్, మరియు అఖిల్, సాయి, శ్యం, విజయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.