Religious
నగరంలో కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలంగాణ సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ నగరంలో కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చిన కేసీఆర్ సర్కారు మందు బాబులకు ఊరటనిచ్చింది.
సైబర్ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ ప్లై ఓవర్లతోపాటు… జేఎన్‌టీయూ, మైండ్‌స్పేస్, దుర్గం చెరువు తీగల వంతెనను సైతం మూసివేయనున్నారు. పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డుపైకి కార్లను అనుమతించరు. ఏటా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగే నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌తోపాటు.. బీఆర్‌కే భవన్, తెలుగు తల్లి కూడలి, లిబర్టీ జంక్షన్, నల్లగుట్ట రైల్వే వంతెన వద్ద వాహనాలను దారి మళ్లిస్తారు.జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 2 గంటల వరకు నగరంలోకి బస్సులు, ట్రక్కుల్లాంటి భారీ వాహనాలను అనుమతించబోమని పోలీసులు తెలిపారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్డు మీద తేలికపాటి వాహనాలకు అనుమతి లేదని ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు మినహాయింపు ఉంటుందన్నారు. పీవీ ఎక్స్‌ప్రెస్ వేకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుంది.న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను సైతం హైదరాబాద్ పోలీసులు చేపట్టారు. తాగి వాహనం నడిపినట్టు తేలితే పదేళ్ల జైలు శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు యూనిఫాం ధరించాలి. అకారణంగా ట్రిప్పులు రద్దు చేస్తే రూ.500 జరిమానా విధిస్తారు.