Religious

రామ‌గుండంఫెర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్ లిమిటెడ్‌(ఆర్ఎఫ్‌సీఎల్‌)లో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికషన్

Kalinga Times,Godavarikhani : భార‌త ప్ర‌భుత్వరంగానికి చెందిన నోయిడా (యూపీ)లో ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న‌ నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ ‌(ఎన్ఎఫ్ఎల్‌) ఆధ్వ‌ర్యంలోని రామ‌గుండం (పెద్దపల్లి-తెలంగాణ) ఫెర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్ లిమిటెడ్‌(ఆర్ఎఫ్‌సీఎల్‌).. 31 అటెండెంట్ గ్రేడ్‌-1 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఐటీఐలో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 12, 2021 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు
https://www.nationalfertilizers.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 31
మెకానిక‌ల్‌- 11
ఎల‌క్ట్రిక‌ల్‌- 12
ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌- 08
అర్హ‌త: పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఐటీఐ(ఫిట్ట‌ర్‌, డీజిల్ మెకానిక్‌, మెకానిక్ రిపేర్ & హెవీ వెహికిల్ మెయింట‌నెన్స్, ఎల‌క్ట్రిషియ‌న్‌, ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ మెకానిక్‌) ఉత్తీర్ణ‌త ఉండాలి‌.
వ‌య‌సు: 30 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు. ఎస్సీ/ ఎస్టీ అభ్య‌ర్థుల‌కు ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.ఈ కింది FCI లింక్ ను క్లిక్ చేయండి నోటిఫికషన్ PDF చూసుకోవచ్చు.

fci

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close