Telangana
కొటేశ్వరి బాయ్ చనిపోయి వారం రోజులు ఐనా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది
Kalinga Times,Hyderabad : సూర్యాపేట జిల్లా, చింతలపాలెం మండలం, పిక్లా తండాలో నివసించే గిరిజన యువతి పీజీ ఎంట్రన్స్ పరీక్ష నిమిత్తం హైదరాబాద్ లోని ఘట్కేసర్ ప్రభుత్వ గురుకుల హాస్టల్ కి వెళ్తున్న అజ్మీరా కొటేశ్వరి బాయ్ ని దారి మధ్యలో కొంతమంది దుండగులు లైగిక దాడి చేశారు. ఇటీవలే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది..
కొటేశ్వరి బాయ్ చనిపోయి వారం రోజులు ఐనా ఈరోజు వరకు అసలు నేరస్థులని పట్టుకొని శిక్ష వేయకుండా ,పోలిసులు,రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బాదిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఆదేక్షుడు బండి సంజయ్ ని, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిని కలిసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ టి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ , బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్, బిజెపి కోర్ కమిటీ సభ్యులు& మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి, సికింద్రాబాద్ బిజెపి జిల్లా అధ్యక్షులు బి శ్యాంసుందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.