Telangana
పాలక వర్గ సభ్యులు అభివృద్ధిలో ఐక్యత చూపరు కాని అవినీతికి మాత్రం ఏకమవుతారు- మద్దెల దినేష్
Kalinga Times,Godavarikhani : రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్నట్లు నేడు మన రామగుండం నగర పాలక సంస్థలో ప్రజల సొమ్ము పాలకుల పాలవుతోందని సీపీఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ విమర్శించారు. ఇటీవల సద్దుల బతకమ్మ పండగ పేరుతో డివిజన్ల లో బతుకమ్మ ఆడే ప్రదేశాలలో స్టోన్ డస్ట్ పోయడం, చెట్లు పొదలు కట్ చేయడం, లైట్లు అమర్చడం కోసం యాబై లక్షలు కేటాయించూకోవడం జర్గిందన్నారు. అసలు ఏ డివిజన్లలో ఎంత డస్ట్ పోశారు, ఎన్ని లైట్లు అమర్చారు, ఎంతవరకు పనులు నిర్వహణ చేశారు అని క్షేత్రస్థాయిలో అధికార్లు కనీసం విచారణ చేశారా అని ప్రశ్నించారు. బతకమ్మ వేడుకలు నిర్వహించుకునే సమయంలో అసలు వర్షాలే లేవు. ఎక్కడ బురద కాలేదు. అలాంటప్పుడు ఇక స్టోన్ డస్ట్ తో ఏమి పని అని అన్నారు. అలాగే వంద నుండి రెండు వందల రూపాయల లైట్లు అమర్చే ప్రక్రియ, ఇక చెట్ల పొదలు తొలిగించే అవసరమే రాలేదు అని పేర్కొన్నారు. ఒక్కో డివిజన్ లలో పది వేలు కూడా కర్చు కాలేదని యాబై డివిజన్ల కలిపి అయిదు లక్షలు కర్చు కాలేదని కానీ యాబై లక్షలు కర్చు చూపించడం నగర పాలక వర్గ కొంత మంది మేదావులకే సాధ్యం అవుతుందన్నారు.అసలు డివిజన్లలో మహిళలకు బతకమ్మ వేడుకలకు నిధులు ఏర్పాటు చేశారా, లేక కార్పొరేటర్లు కుటుంబాలకు నిధులు ఏర్పాటు చేశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇపుడు ప్రజా ప్రతినిధుల సెల్ ఫోన్ ల కోసం ఇరవై లక్షల రూపాయిలు కెటాయించడం సిగ్గుచేటన్నారు. వారికి స్మార్ట్ ఫోన్ లు ఉండవా ప్రత్యేకించి ప్రజాధనం తో కోనివ్వడం ఎందుకని ప్రశ్నించారు. ప్రజా దన దుర్వినియోగం పనులు మానుకోవాలని అన్నారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఐ ఎ ఏస్ గారు చర్యలు తీసుకోవాలని అవసరమైతే విజిలెన్స్ విచారణ చేయాలని దినేష్ డిమాండ్ చేశారు.