social
కలబంద ప్రయోజనాలు
Kalinga Times,Hyderabad : కలబందలో గ్లిసరిన్, సోడియం పామాల్, సోడియం కార్బోనేట్, సోడియం పామ్ కెమేలేట్, సార్బిటోల్ మొదలైనవి వంటి అనేక పోషకాలతో కలిగి ఉంటుంది ఇవి మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది.
కలబంద రూప గుణ ప్రభావాలు
కలబంద దాన్ని సంస్కృతంలో కుమారీ అని పిలుస్తారని అలాగే ఆంగ్లంలో Aloe Vera అని అంటారు ఇది ఒక అందమైన చెట్టు . ఇది బాగా పెరిగిన తరువాత కలబంద మట్టలను అడ్డంగా కోస్తే దాని నుంచి తెల్లని చిక్కని ద్రవం కారుతుంది. దాన్ని ఎండలో పెడితే అది నల్లగా మారుతుంది. దానినే మూసాంబరం అంటారు. దీనిని తయారు చేసుకొని ఎల్లప్పుడూ నిల్వ ఉంచుకుని అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగించుకునే గొప్ప సంప్రదాయం మన తెలుగునాట యుగయుగాలుగా ఉంది. ఈ దరిద్రపు ఆధునిక యుగంలో ఆ అలవాటు నశించిపోయింది.