Telangana
సిద్దిపేటలో సోదాలపై సీపీ జోయల్ డేవిస్ స్పష్టత
Kalinga Times,Siddipeta : దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. సోదాలపై సీపీ జోయల్ డేవిస్ స్పష్టత ఇచ్చారు. సిద్దిపేటలో ముగ్గురి ఇళ్లలో సోదాలు చేశామని ఆయన తెలిపారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్స్, సురభి రాంగోపాలరావు, అంజన్‌రావు ఇళ్లలో తనిఖీలు నిర్వహించామన్నారు. సురభి అంజన్‌రావు ఇంట్లో రూ.18 లక్షల నగదు దొరికిందని చెప్పారు.