social

విజయదశమి రోజు శమీపూజ అనంతరం ‘పాలపిట్ట’ను చూసే సంప్రదాయం

 దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. ‘శ్రవణా’ నక్షత్రంతో కలసిన ఆశ్వయుజ దశమికి ‘విజయా’ అనే సంకేతముంది. అందుకే దీనికి‘విజయదశమి’అనే పేరు వచ్చింది. తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకుండా విజయదశమి రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తథ్యం.
‘శమీపూజ’ దశమి రోజు మరింత ముఖ్యమైంది. శమీవృక్షమంటే ‘జమ్మిచెట్టు’.పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమీవృక్షంపైనే దాచిపెట్టారు. ఈ సమయంలో విరాటరాజు కొలువులో ఉన్న పాండవులు.. ఏడాది షరతు పూర్తికాగానే ఆ వృక్షాన్ని ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను పొంది, శమీవృక్ష రూపంలోని ‘అపరాజితా దేవి’ ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయం సాధించినారు.

Kalinga Times,Hyderabad :  శ్రీరాముడు విజయదశమి నాడే అపరాజితా దేవిని పూజించి, రావణుని సహరించాడు. తెలంగాణలో శమీపూజ అనంతరం ‘పాలపిట్ట’ను చూసే సంప్రదాయం ఉంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శమీవృక్షం వద్ద అపరాజితాదేవిని పూజించి, ‘శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ, అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ’ అనే ఈ శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. ఈ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృప, శనిదోష నివారణ జరుగుతుందని ప్రతీతి.
మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా పదో రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో అధికంగా ఉంటుంది. దేనదానవులు పాల సముద్రం మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తాన్నే ‘విజయదశమి’గా పేర్కొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close