social
5 ఇంక్ లైన్ ఫిల్టర్ బెడ్ దుర్గామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
Kalinga Times,Godavarikhani : దేవి నవరాత్రుల సంధర్భంగా గోదావరిఖనిలోని 5 ఇంక్ లైన్ ఫిల్టర్ బెడ్ వద్ద సివిల్ ఆఫీస్ ప్రాంగణంలోని దుర్గామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.. ఆలయ పురోహితులు ప్రశాంత్ మహరాజ్ భక్తులచే అభిషేకం,దేవి అర్చనలను నిర్వహించారు.శరన్నవరాత్రుల ప్రాముఖ్యాన్ని గురించి ప్రశాంత్ మహరాజ్ వివరిస్తూ.. ఆపద వచ్చినడు ఎవరైనా అన్యాపదేశంగానే అమ్మా అంటూ..తలచుకుంటాం.. కారణం మనల్నిమాత్రమే కాదు సృష్టి లోని ప్రతి ప్రాణిని రక్షించేది ఆ జగదాంబే కదా ! అందుకే ఆ అంబ ఆశీస్సులు మనపై ఉండాలని ఏడాదిలో ఒక్కసారైనా అమ్మను పూజిద్దాం.. శరన్నవరాత్రులను ఘనంగా జరుపుకోవాలని ఆయన భక్తులకు సూచించారు.